ఫిబ్రవరి నెల వచ్చేసిందంటే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది వాలంటైన్స్ డే. ఫిబ్రవరి నెలలోనే 14వ తేదీన ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటారు. వారానికి ముందు నుంచే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఫిబ్రవరి 7వ తేదీన రోజ్ డేతో ప్రారంభమయ్యే ఈ సెలబ్రేషన్స్ .. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేతో ముగుస్తుంది. ఈ రోజుల్లో తమ ప్రియమైన వారికి బహుుమతుల ఇచ్చి తమ ప్రేమను తెలియజేస్తారు. ప్రేమించిన వారికి ఏ గిఫ్ట్ ఇస్తే ఇంప్రెస్ అవుతారో అని ఆలోచిస్తూ నానాతంటాలు పడుతుంటారు చాలా మంది. ఇందుకోసం గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్‌లు, గిఫ్ట్‌లు , పువ్వులు ఇలా రకారకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. తక్కువలో తక్కువగా రూ. 500 లోపు బెస్ట్ బహుమతులు ఎంటో ఇప్పుడు చూద్దాం.
పుస్తకాలు : మీ ప్రియమైన వ్యక్తి పుస్తకాల పురుగు అయితే వారికి ఇష్టమైన రచయిత పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వండి. ఆ పుస్తకం చదివినప్పుడాల్లా మీరే గుర్తుకు వస్తుంటారు.
పెర్ఫ్యూమ్ : బయటికి వెళ్లే ముందు మీ ప్రియమైన వారు మిమ్మల్ని ప్రతిక్షణం గుర్తించుకునేలా మంచి పెర్ఫ్యూమ్ బహుమతిగా ఇవ్వండి.
సన్ గ్లాసెస్ : సన్ గ్లాసెస్ రోజు సూర్యుని కాంతి నుండి కళ్ళను కాపాడుతుంది. మీరు వారి పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో వారికి తెలియజేయడానికి ఇది గొప్ప బహుమతి.
ఇయర్ ఫోన్స్ : బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు లేదా వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను బహుమతిగా ఇవ్వవచ్చు. పని లేదా ప్రయాణ సమయంలో వాటిని పెట్టుకుని మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు.
ALSO READ :- అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి..ఏడాదిలో ఇది ఐదోది
మెుబైల్ ఫోన్ బ్యాక్ కవర్ : ఇప్పుడు చాలా మంది ఫోన్ కవర్‌పై వారి స్వంత డిజైన్‌లను తయారు చేసి ఇస్తున్నారు. మీరు దానిపై అందమైన డిజైన్‌ను కూడా చేయవచ్చు. ఫోన్ చూసినప్పుడల్లా మీరే గుర్తుకువస్తారు