
సీజన్ మారిందంటే చాలు జనాలు భయపడుతుంటారు. జ్వరాలు.. జలుబు... దగ్గు.. ఇతర వ్యాధులు వస్తాయని ఆందోళన చెందుతుంటారు. ఇవే కాదు స్కిన్ అలర్జీ రావడం.. అందమైన చర్మం కాస్త.. అసహ్యంగా తయారవుతుంది. ఇక ముఖంపై మచ్చలు.. మొటిమలు .. ఇలా అనేక చర్మ సంబంధమైన వ్యాధులతో బయటకు వెళ్లలేక.. ఇంట్లో ఉండలేక .. అలాంటి వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. అలాంటి వారికి తమలపాకు ఎంతో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. చర్మ వ్యాధులకు తమలపాలకు ఎలా ఉపయోగపడుతుంది.. ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం . . ..
తమలపాకులో యాంటీ ఇన్ ఫ్ల మేటరీ.. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని ముఖంపై ఉంచితే చల్లగా.. హాయిగా ఉంటుంది. దద్దుర్లు.. మంట ఉన్న చోట దీని రసాన్ని రాస్తే ఉపశమనం కలుగుతుంది. అంతే కాదు చాలా రకాల చర్మవ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మొటిమలు: ముఖంపై చెమట కారణంగా జిడ్డు ఏర్పడుతుంది. ఈ జిడ్డు చాలా చిరాగ్గా ఉంటుంది. ఇదే ఫేస్‌పై పేరుకుపోయి.. మొటిమలు గామారుతుంది. ఇవి ముఖం అందాన్ని చెడగొట్టడమే కాకుండా.. నొప్పి కూడా ఉంటుంది. అలాంటప్పుడు తమలపాకుతో మొటిమలను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముందుగా తమలపాకును నీటితో శుభ్రం చేయాలి. ఆ తరువాత మిక్సీలో మెత్తగా రుబ్బాలి. ఆ పేస్ట్ ను తీసి.. ఆ వాటర్ ను వడగట్టి.. కాటన్ తో ముఖంపై రాయాలి. అప్పుడు హాయిగా.. చల్లగా ఉంటుంది. చిరాకు.. కోపం తగ్గుతుంది. దీంతో చర్మం అందంగా కనపడుతుంది. ఇలా రెండు మూడు రోజులు చేస్తే మొటిమలు తగ్గుతాయి.
నల్లటి మచ్చలు: ముఖంపై నల్లటి మచ్చలు వచ్చాయా ... ఇక అంతే మన ఫేస్ ను మనమే అద్దంలో చూసుకోడానికి ఇబ్బంది పడతాం. ఇక అంతే అనేక క్రీములు వాడతాం. ఇలాంటి ఫేస్ క్రీమ్‌లు ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తాయి. అలాంటప్పుడు తమలపాకు రసాన్ని తీయాలి. అందులో కొద్దిగా తేనె కలపాలి. ఆ తరువాత ఫేస్ ను చల్లటి నీళ్లతో వాష్ చేసుకొని ఆరిన తరువాత మచ్చలున్న ప్రదేశంలో తేనె.. తమలపాకు రసం మిశ్రమాన్ని రాయాలి. నల్లటి మచ్చ బ్యాక్టీరియా వల్ల ఏర్పడుతుంది. ఆ బ్యాక్టీరియాను ఈ మిశ్రమం తొలగిస్తుంది.
చర్మం తెల్లగా ఉండాలంటే.. చాలామంది ఎన్ని క్రీములు వాడినా.. ఎంత పౌడర్ రాసినా ఫేస్ అట్రాక్షన్ గా ఉండదు. ఇది కంప్యూటర్ యుగం.. ఫేస్ఎంత అందంగా ఉంటే అంత ఫాలోయింగ్ ఉంటుంది. వంటింటి చిట్కాలను ఉపయోగిస్తే ముఖం అందంగా తయారవుతుంది. తమలపాకును మెత్తగాపేస్ట్ చేపి.. అందులో నీరు.. శనగపిండి .. పసుపు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేయండి. దీనిని ముఖాన్ని అప్లై చేసి.. అరగంట తరువాత.. గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోండి. ఇక అంతే ముఖం మెరిసిపోతుంది.