బేటీ బచావో బేటీ పడావోతో ఆడపిల్లలకు భరోసా..ప్రభుత్వ స్కూల్ బాలికలకు సైకిళ్ల అందజేత  

బేటీ బచావో బేటీ పడావోతో ఆడపిల్లలకు భరోసా..ప్రభుత్వ స్కూల్ బాలికలకు సైకిళ్ల అందజేత  
  • బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, వెలుగు:  ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతూ  సైకిల్ అవసరం ఉన్న బాలికలందరికీ అందజేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు.  మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా 100 మంది ప్రభుత్వ పాఠశాల బాలికలకు శనివారం సైకిళ్లను అందజేశారు.

కరీంనగర్ లోని టీఎన్జీవో ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ  సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పదేళ్లవుతున్న నేపథ్యంలో సైకిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో టెన్త్ చదివే  ఆడపిల్లలకు సైకిల్ అందిస్తామని తెలిపారు.

 గర్ల్స్ హాస్టళ్లకు  వాషింగ్ మిషన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మెంబర్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. 


సీసీ రోడ్డు పనులు ప్రారంభం 

మల్యాల, వెలుగు: మల్యాల మండలంలోని ఆయా గ్రామాల్లో  వివిధ అభివృద్ధి పనులకు కోసం ఉపాధి హామీ కింద రూ. కోటి 2 లక్షలు నిధుల మంజూరు చేయించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం  మండలంలోని బల్వంతాపూర్, లంబాడిపల్లి, ముత్యంపేట గ్రామాల్లో ఆయన పర్యటించారు .బల్వంతపూర్ లో రూ. 5 లక్షల సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. లంబాడిపల్లిలో లంచ్ లో పాల్గొన్న బండి సంజయ్ అక్కడ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యేలు బొడిగే శోభ, సుద్దాల దేవయ్య, తహసీల్దార్ మునీందర్, డీఎస్పీ  రఘుచందర్, పాల్గొన్నారు. 

గర్శకుర్తి వెంకటేశ్వస్వామి బ్రహ్మోత్సవాల్లో 

గంగాధర, వెలుగు: గాధర మండలం గర్శకుర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవం కనుల పండువగా జరిగింది. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉప్పరమల్యాలలో రూ.1.21 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్మన్​ కల్వకోట శ్రీనివాసరావు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, చొప్పదండి నియోజకవర్గ కన్వీనర్​ పెరుక శ్రవణ్​, బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్​తదితరులు పాల్గొన్నారు.