మంచిర్యాల, వెలుగు : అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారసభ రాష్ట్ర అధ్యక్షుడు బేతి తిరుమలరావును ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డుతో సత్కరించింది.
ఆదివారం కేరళలోని ఆలువలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ , కేరళ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించిన జాతీయ సదస్సులో కేరళ రాష్ట్ర పరిశ్రమలు, న్యాయశాఖ మంత్రి పి.రాజీవ్ బేతి తిరుమలరావుకు అవార్డును అందజేశారు.