మిర్యాలగూడ, వెలుగు : ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు. గురువారం ఉదయం 9 గంటలకు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
ఆస్పత్రిలోని వైద్యుల హాజరుశాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని డాక్టర్లకు మెమో జారీ చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ కు ఆదేశాలు జారీ చేశారు. డాక్టర్లు తమ పద్ధతి మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.