Priyanka Gandhi: నా తొలి ప్రసంగం కంటే బెటర్: లోక్‌సభలో ప్రియాంక తొలిస్పీచ్పై రాహుల్

Priyanka Gandhi: నా తొలి ప్రసంగం కంటే బెటర్: లోక్‌సభలో ప్రియాంక తొలిస్పీచ్పై రాహుల్

లోక్ సభలో వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ లోక్ సభలో తొలి ప్రసంగాన్ని రాహుల్ గాంధీ ప్రశంసించారు. శుక్రవారం (డిసెంబర్ 13) లోక్ సభ సమావేశాల్లో ప్రియాంక తొలి స్పీచ్ బాగుంది.. నా తొలి స్పీచ్ కంటే బెటర్ గా ఉందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశంసలతో ముంచెత్తారు. 

వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ లోక్ సభలో తన తొలి ప్రసంగంతో అదరగొట్టారు.. తొలి స్పీచ్ లోనే ఏన్డీయే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం..రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తుందని ఆరోపించింది. రాజ్యాంగం, రిజర్వేషన్లు, దేశ వ్యాప్తంగా కుల గణను చుట్టే తిరిగింది. భారత రాజ్యాంగం అంటే ఏందో ప్రధాని మోదీకి అర్థం కాదు..యూనియన్ రాజ్యాంగం అని అన్నారు ప్రియాంకగాంధీ.

సంభాల్, మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రధాని మోదీ స్పందించకపోవడంపై ప్రియాంకగాంధీ తప్పుబట్టారు. రాజ్యాంగం అంటే మోదీకి అర్థంకాలేదు.. రాజ్యాంగాన్ని మోదీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) రూల్‌బుక్ అని అనుకుంటున్నారని ప్రియాంకగాంధీ అన్నారు. 

సభలో రాజ్యాం గంపై చర్చలో పాల్గొన్న వయనాడ్ ఎంపీ , రాజ్యాంగం న్యాయం, ఐక్యత, భావప్రకటనా స్వేఛ్చకు రక్షణకవచమని అన్నారు..గత పదేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్కవం రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. 

మరోవైపు గత లోక్ సభ ఎన్నికలపై ప్రియాంక గాంధీ విమర్శలు చేశారు. లోక్ సభ  ఎన్నికల్లో బీజేపీకి అధిక సీట్లు వస్తే..రాజ్యాంగాన్ని  మార్చే ప్రక్రయ ప్రారంభించే వార ని ప్రియాంక గాంధీ అన్నారు. భారత రాజ్యాంగం అర్థం కాదు, యూనియన్ రాజ్యాంగం అని అన్నారు.