ఐపీఎల్ టోర్నీలో మిగిలిన 9 జట్ల సంగతి ఒకలా ఉంటే.. ఆర్‌సీబీ టీమ్ పరిస్థితి మరోలా ఉంది. ఎప్పటిలానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ ఏడాది ప్లేఆఫ్స్ రేసులో వెనుకబడి పోయింది. ఇప్పటివరకూ 7 మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్ సేన.. ఆరింట ఓటమిపాలైంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. లీగ్ దశలో వారింకా 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా.. అన్నింటా విజయం సాధిస్తే తప్ప ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు లేవు. దీంతో ఆర్‌సీబీ జట్టు ప్రదర్శనపై త్రీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సోమవారం(ఏప్రిల్ 15) సన్‌రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లు పోటీ పడి మరీ పరుగులిచ్చారు. ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు ట్రావిస్ హెడ్(102), హెన్రిచ్ క్లాసెన్(69)ల బౌండరీల ప్రవాహానికి చిన్నస్వామి స్టేడియం తడిసిముద్దైంది. నిర్ణీత ఓవర్లలో 287 పరుగులు చేసిన హైదరాబాద్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్ల ప్రదర్శనపై భారత మాజీ దిగ్గజం క్రిష్ణమాచారి శ్రీశాంత్ మండిపడ్డారు. ప్రస్తుత ఆర్‌సీబీ జట్టులో నాణ్యమైన బౌలర్ లేరన్న శ్రీశాంత్.. వారి కంటే విరాట్ కోహ్లీ అత్యుత్తమంగా బౌలింగ్ చేయగలరని అన్నారు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన శ్రీకాంత్.. బెంగళూరు జట్టు 11 మంది బ్యాటర్లతో బరిలోకి దిగడం మంచిదని సూచించారు. ఆ జట్టు ఫ్రంట్‌లైన్ బ్యాటర్లు డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, కామెరాన్ గ్రీన్ లను బౌలర్లుగా వాడుకోవాలని ఆ జట్టు యాజమాన్యానికి సలహా ఇచ్చారు.
"రీస్ టోప్లీ స్మాష్ అవుతున్నాడు. లాకీ ఫెర్గూసన్ ను చితక్కొట్టారు. ముఖ్యంగా లాకీని కోల్‌కతా నుంచి కొనుగోలు చేసినా పెద్దగా ప్రయోజనం లేదు. విల్ జాక్స్ వారి అత్యుత్తమ బౌలర్. ఉన్నవారిలో అతడే కాస్త నయం. జట్టులో బౌలర్లున్నా, లేకపోయినా తేడా ఉండదు. 11 మంది బ్యాటర్లలో బరిలోకి దిగడం మంచిది. డుప్లెసిస్ 2, కామెరూన్ గ్రీన్ 4 ఓవర్లు వేయొచ్చు. వీరికి తోడుగా కోహ్లీ ఉండనే ఉన్నాడు. అతను 4 ఓవర్లు వేయగలడు. రెగ్యులర్ బౌలర్లతో పోలిస్తే విరాట్ తక్కువ పరుగులు ఇస్తాడు.. నాకు తెలుసు.." అని ఈ మాజీ దిగ్గజం అన్నారు.
కోహ్లీని చూస్తే బాధేసింది
సన్‌రైజర్స్ బ్యాటర్లు కొట్టుడుకు బంతులు చిన్నస్వామి స్టేడియం మీదుగా వెళ్తుంటే నిస్సహాయంగా చూస్తున్న విరాట్ ను చూసి తనకు చాలా బాధేసిందని శ్రీకాంత్ తెలిపారు. బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు విరాట్ చాలా కోపంతో ఉన్నట్లు కనిపించారని మాజీ క్రికెటర్ వెల్లడించారు.
ఆర్‌సీబీ తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్
- ఏప్రిల్ 15న.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో
- ఏప్రిల్ 21న.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో
- ఏప్రిల్ 25న.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో
- ఏప్రిల్ 28న.. గుజరాత్ టైటాన్స్‌తో
- మే 04న.. గుజరాత్ టైటాన్స్‌తో
- మే 09న.. పంజాబ్ కింగ్స్‌తో
- మే 12న.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో
- మే 18న.. చెన్నై సూపర్ కింగ్స్‌తో