ఈ స్టాక్స్ ​కొంటే బెటర్

ఈ స్టాక్స్ ​కొంటే బెటర్
  •  ఎక్స్​పర్టుల రికమండేషన్స్​

న్యూఢిల్లీ: యూనియన్ బడ్జెట్ 2024కి భారతీయ స్టాక్ మార్కెట్లను నిరాశపర్చినప్పటికీ, కొన్ని స్టాక్స్​పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మనదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాలనే ఆలోచనతో ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే ఈ బడ్జెట్ లక్ష్యమని అంటున్నారు.  సమీప కాలంలో మార్కెట్లలో కుదుపులు వచ్చే అవకాశాలను తోసిపుచ్చకపోయినా, తయారీ, మౌలిక సదుపాయాలు, రక్షణ  విద్యుత్ రంగాల షేర్లకు మంచి భవిష్యత్​ ఉండొచ్చని చెబుతున్నారు.  

ఈ విషయమై స్టాక్​బాక్స్​ రీసెర్చ్ హెడ్ మనీష్ చౌదరి మాట్లాడుతూ బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆంధ్రప్రదేశ్​లో ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై బడ్జెట్ దృష్టి పెట్టిందని చెప్పారు. తయారీ, పునరుత్పాదక ఇంధనం,  కొత్త రంగాల కోసం పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు ప్రకటించిందని ప్రశంసించారు.  గ్రామీణ ఆదాయాలను పెంచడానికి నిర్ణయాలను తీసుకుందని, ఇవన్నీ మార్కెట్లకు మేలు చేస్తాయని పేర్కొన్నారు. తయారీ, మౌలిక సదుపాయాలు, రక్షణ,  విద్యుత్ రంగాలపై ఇన్వెస్టర్లు ఫోకస్​ చేయాలని సూచించారు. 

ఎస్​ఎస్​ వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రీట్ ఫౌండర్​ సుగంధ సచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేవా మాట్లాడుతూ యూనియన్ బడ్జెట్ వృద్ధి ఆధారితంగా ఉందని మెచ్చుకున్నారు. భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపే దృక్పథంతో దీనిని తీర్చిదిద్దారని అన్నారు. ద్రవ్య లోటును జీడీపీలో 5.1 శాతం నుంచి 4.9 శాతానికి తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు అనుకూలమని అన్నారు. బడ్జెట్​ తరువాత కొనాల్సిన తొమ్మిది షేర్లను ఆమె రికమండ్ చేశారు. అవి పక్కన ఉన్నాయి.

1. ఎస్​బీఐ కార్డ్: బయ్ రూ.680 – రూ.685, టార్గెట్​ రూ.840, స్టాప్ లాస్ రూ.595
2. ఒబెరాయ్ రియల్టీ: బయ్​ రూ.1570 – రూ.1580, టార్గెట్​ రూ.2050, స్టాప్ లాస్ రూ.1280
3. రైట్స్: బయ్​ రూ.650 – రూ.660, టార్గెట్​ రూ.880, స్టాప్ లాస్ రూ.520
4. కేపీఐటీ టెక్: బయ్​ రూ.1690 – రూ.1695, టార్గెట్​ రూ.2080, స్టాప్ లాస్ రూ.1500
5. హెచ్​బీఎల్​ పవర్: బయ్​ రూ.540 – రూ.550, టార్గెట్​ రూ.765, స్టాప్ లాస్ రూ.430
6. రాజేష్ ఎక్స్​పోర్ట్స్​: బయ్​ రూ.310 – రూ.312 , టార్గెట్​ రూ.435, స్టాప్‌‌‌‌ లాస్‌‌‌‌​ రూ.225
7. రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో సిమెంట్: బయ్​ రూ.790 – రూ.795 , టార్గెట్​ రూ.965, స్టాప్ లాస్ రూ.680
8. ఎన్​సీసీ: బయ్​ రూ.335, టార్గెట్​ రూ.435, స్టాప్ లాస్ రూ.270 
9. టాటా కన్జూమర్​: బయ్​ రూ.1220, టార్గెట్​ రూ.1480, స్టాప్ లాస్ రూ.1070.