మెరుగైన వైద్యం అందించాలి.. : డీఎంహెచ్​వో  కోటాచలం 

తుంగతుర్తి, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు మెరుగైన వైద్యం  అందేలా చూడాలని సంబంధిత అధికారులను సూర్యాపేట డీఎంహెచ్​వో కోటాచలం సూచించారు. బుధవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. సబ్ సెంటర్ లో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యరక్షణ కోసం నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ  సహజ కాన్పులు జరిగేలా చూడాలని సూచించారు. గర్భిణులు, చిన్న పిల్లలకు సకాలంలో టీకాలు వేయించాలాని, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  అవగాహన కల్పించాలని చెప్పారు. ఆయన వెంట డాక్టర్ మల్లెల వందన, సీహెచ్​ఓ మాలోతు బిచ్చు నాయక్, వైద్య సిబ్బంది నర్సింహా రెడ్డి, రమాదేవి, ఆశ కార్యకర్తలు 
పాల్గొన్నారు. .