బ్రీత్ హాస్పిటల్​ ద్వారా మెరుగైన వైద్యం

ఖమ్మం టౌన్, వెలుగు :  సిటీలోని మయూరి సెంటర్ లో ఉన్న బ్రీత్ చెస్ట్, జనరల్ క్రిటికల్ కేర్,  మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 5వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చెస్ట్​, క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ గోపగాని సురేందర్ మాట్లాడుతూ హాస్పిటల్ లో పేద, మధ్యతరగతి వారికి  మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, రోగులకు రాయితీ ఇస్తున్నామని డాక్టర్ చెప్పారు. కార్యక్రమంలో శ్రావ్య, కొండా జయ, వెంకటేశ్వర్లు హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు.