బ్లూకాలర్‌‌‌‌ జాబ్స్‌‌‌‌ కోసం ‘బెటర్‌‌‌‌ప్లేస్’ యాప్‌‌‌‌

అందుబాటులో 10 లక్షల జాబ్స్‌‌‌‌
హైదరాబాద్‌‌‌‌, వెలుగు: డెలివరీ ఏజెంట్స్‌‌‌‌, డ్రైవర్లు, ఫీల్డ్ అసోసియేట్స్, రిటైల్ అసోసియేట్స్, టెలికాలర్స్, ఎలక్ట్రీషియన్‌‌‌‌ వంటి బ్లూకాలర్‌‌‌‌ జాబ్స్‌‌‌‌ వెతికే వారి కోసం మొబైల్‌‌‌‌ అప్లికేషన్‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చినట్టు టెక్‌‌‌‌ కంపెనీ బెటర్‌‌‌‌ప్లేస్‌‌‌‌ ప్రకటించింది. మంచి జీతం ఇవ్వగల జాబ్స్‌‌‌‌ను వెతుక్కోవడానికి ఈ యాప్‌‌‌‌ ఎంతగానో సాయపడుతుందని కంపెనీ తెలిపింది. అప్లికెంట్లు తమ స్కిల్స్‌‌‌‌ను కూడా మెరుగుపరుచుకునేందుకు కూడా దీనిని వాడుకోవచ్చని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1200 కు పైగా కంపెనీల నుండి 10 లక్షలకు పైగా వెరిఫైడ్‌‌‌‌ జాబ్స్‌‌‌‌ ఈ యాప్‌‌‌‌ ద్వారా అందుబాటులో ఉన్నాయి.