
బెట్టింగ్ యాప్స్పై ఫుల్ సీరియస్గా ముందుకు వెళ్తున్నారు పోలీసులు. డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్పై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
ఇప్పటికే 11 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లకు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే వీరిలో పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, హర్ష సాయి దుబాయ్కి పరారీ అయినట్లు తెలుస్తోంది. అరెస్ట్ భయంతోనే వీరిద్దరూ దుబాయికి జంప్ అయ్యారని, పోలీసులు వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారని సమాచారం. అంతేకాకాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ లెక్కలో మరో 6 మందికి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఇందులో నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలు ఉన్నారు. వీరు రేపు (మార్చి 20న) విచారణకు హాజరు కావలసిందిగా పంజాగుట్ట పోలీసులు నోటీసులో తెలిపారు. ఇప్పటికీ బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి పలు కీలకమైన ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా హీరోయిన్లు, హీరోలతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు నిఘా ఉంచారు.
మార్చి 18న టేస్టీ తేజ, విష్ణుప్రియను విచారణకు హాజరుకావాాలంటూ ఆదేశించగా..అయితే విష్ణు ప్రియ డుమ్మ కొట్టగా..టేస్టీ తేజ విచారణకు హాజరయ్యారు. మరో వైపు బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చేరినట్లు తెలుస్తోంది. వీరిపై మరింత ఉచ్చు బిగించేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.