బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ఎంట్రీ.. కొల్లగొట్టిన డబ్బు ఎవరి అకౌంట్లలోకి వెళ్లింది ?

బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ఎంట్రీ.. కొల్లగొట్టిన డబ్బు ఎవరి అకౌంట్లలోకి వెళ్లింది ?
  • పంజాగుట్ట పోలీసుల నుంచి వివరాల సేకరణ
  • మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు
  • నిందితులకు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ

హైదరాబాద్, వెలుగు: బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ (ఈడీ) ఎంటర్ అయ్యింది. మనీ లాండరింగ్  కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. పంజాగుట్ట పీఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ సహా నిందితుల వివరాలను ఈడీ అధికారులు మంగళవారం సేకరించారు. యూట్యూబర్లు యాంకర్ శ్యామల, విష్ణుప్రియ సహా కేసులో నిందితులైన 11 మంది వివరాలతో పాటు వారు ప్రమోట్  చేసిన సోషల్ మీడియా లింకులను తీసుకున్నారు.

ప్రస్తుతం ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తుండడంతో ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సేకరించిన డాక్యుమెంట్లతో ఈవారంలో ఈసీఈఐ నమోదు చేయనున్నట్లు తెలిసింది. తరువాత నిందితులను విచారించనున్నారు. బ్యాంక్ స్టేట్ మెంట్లు సహా వారి అకౌంట్లలో డిపాజిట్  అయిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, బెట్టింగ్  యాప్స్  ద్వారా కొల్లగొట్టిన డబ్బు ఎవరి అకౌంట్లలోకి వెళ్లింది అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. నిందితులు సహా యాప్స్  నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు.