నాలుగు ఎంపీ సీట్లపై భారీ బెట్టింగ్

నాలుగు ఎంపీ సీట్లపై భారీ బెట్టింగ్

రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలపై జోరుగా పందేలు కాస్తున్నారు. మొన్నటి వరకు రెండు సీట్లపైనే బెట్టింగులు సాగగా సోమవారం రాత్రి నుంచి ఆ జాబితాలోకి మరో రెండు సీట్లు వచ్చి చేరాయి. చేవెళ్ల, మల్కాజ్ గిరి, ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపీ స్థానాలపై పందెం రాయుళ్లు లక్షలకు లక్షలు కాస్తున్నారు. చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ, కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై భారీగా పందేలు కాస్తున్నారు. మల్కాజ్ గిరి లోని కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై పందేలు కాస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే రేవంత్ పై పందెం కాయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై పెద్దఎత్తున పందేలు నడుస్తున్నాయి. ఇక్కడా కాంగ్రెస్‌ క్యాండి డేట్‌ వైపే బెట్టింగుల్లో మొగ్గు కనిపిస్తోంది.ఎవరూ ఊహించనట్టుగా ఎస్టీ రిజర్వుడ్‌ స్థానం మహబూబాబాద్‌ సీటుపైనా బెట్టింగులు జోరుగాసాగుతున్నాయి. కాంగ్రెస్‌కు పాజిటివ్‌ వాతావరణం ఉందనే కారణంతో బుకీలు ఈ సీటును పందేనికి తెచ్చినట్టు సమాచారం. ఇక్కడ రూ.లక్ష వరకు పందెం కాస్తున్నట్టు తెలిసింది. ఈ సీటుపై తొలుతఎక్కువ మంది టీఆర్‌ఎస్‌ క్యాండిడేట్‌ మాలోత్  కవితపైనే పందేలు కాయగా, బుధవారం ఉదయంనుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్ పైనా బె-ట్టింగ్‌లు పెడుతున్నట్టు సమాచారం.

వాట్సాప్‌ వేదిక
ఎన్నికల బెట్టింగులు వాట్సాప్‌ వేదికగా సాగుతున్నట్టు సమాచారం. బెట్టింగ్‌ టీంలు ఇప్పటికే కొన్నిగ్రూపులుగా ఉన్నాయి. మెయిన్‌ బుకీ నుంచి సబ్‌బుకీలకు పోల్‌ బెట్టింగ్‌లపై సమాచారం వస్తోంది.సబ్‌ బుకీలు ఆ సమాచారాన్ని వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్ట్‌ చేస్తున్నారు. ఆయా సీట్ల పరిధిలో ఉన్న తమసన్నిహితు ల ద్వారా సమాచారం సేకరించి వాటిఆధారంగా పందేలు కాస్తున్నారు. బెట్టింగ్‌కు సం-బంధిం చిన మొత్తాన్ని బిట్‌ కాయిన్ల రూపంలోపెడుతున్నారు. మరికొందరు గూగుల్‌ పే లాంటిమొబైల్‌ పేమెంట్‌ యాప్‌లను వినియోగిస్తున్నారు.

మొన్న మునిగి..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రా నాయకుడిసర్వేలు నమ్ముకొ ని ఎందరో భారీగా బెట్టింగ్​లుకాశారు. కొందరు సినీ ప్రముఖులు, వ్యాపారవే-త్తలు కూడా పందేలు కాసి.. దివాళా తీసినట్టుగాప్రచారం జరిగింది. ఇప్పుడు వారంతా ఏపీ అసెంబ్లీఎన్ని కలపై బెట్టింగ్‌లు కాస్తున్నారు. వారిలోకొందరు చేవెళ్ల, మల్కాజ్ గిరి, ఖమ్మం ఎంపీ స్థా -నాలపై పందేలు పెడుతున్నట్టుగా తెలిసింది.సినీ నటుడు పోసాని కృష్ణమురళి క్యూలెనులో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు

ఏపీ ఆపరేషన్ ఇక్కడి నుంచే
ఏపీ అసెంబ్లీ ఎన్ని కల బెట్టింగ్ వ్యవహారం హైదరాబాద్ నుంచే సాగుతున్నట్టు సమాచారం. గోవా,బీహార్ కు చెందిన బెట్టింగ్ ముఠాలు మూడు నెలల ముందు నుంచే రంగంలోకి దిగి ప్రతి నియోజకవర్గం లో సర్వేలు చేయించాయి. పకడ్బందీగా పెద్ద శాంపిళ్లతో సర్వేలు కొనసాగించాయి. ఎవరుగెలిచే అవకాశముందో అంచనా వేసుకొ ని పందేలు మొదలు పెట్టాయి. గురువారం పోలిం గ్ జరుగుతుండగా బుధవారం సాయంత్రం కూడా బెట్టింగ్ టీమ్ లు సర్వేలు చేయించినట్టు తెలిసింది. లాస్ట్ మినిట్ బెట్టింగుల్లో భారీ ఎత్తున పందేలు కాస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల బెట్టింగ్ వ్యవహారంవేల కోట్లలో ఉంటు న్నట్లు తెలుస్తోంది. క్యాండి డేట్లుగా చూస్తే ఏపీలో మంత్రి లోకేశ్, జనసేన అధినేతపవన్ కళ్యాణ్, నటుడు బాలకృష్ణ సీట్లపై భారీగా పందేలు కాస్తున్నారు.