హయత్ నగర్ లో వ్యాపారి దారుణ హత్య.. బెట్టింగ్ లావాదేవీలే కారణం..!

హయత్ నగర్ లో వ్యాపారి దారుణ హత్య.. బెట్టింగ్ లావాదేవీలే కారణం..!

హైదరాబాద్ లోని హయత్ నగర్లో జరిగిన దారుణ హత్య  స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం ( డిసెంబర్ 3, 2024 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.హయత్ నగర్ కు చెందిన కాశీరాం అనే వ్యక్తి క్యాబ్స్ బిజినెస్ చేస్తూ బెట్టింగ్స్ నిర్వహించేవాడు. ఈ క్రమంలో తన దగ్గర పనిచేస్తున్న శేఖర్ అనే వ్యక్తికి కాశీరాం రూ. 4 లక్షలు అప్పుగా ఇచ్చాడు. రోజులు గడుస్తున్నప్పటికీ శేఖర్ డబ్బులు తిరిగి ఇవ్వకపోవటంతో గట్టిగా నిలదీశాడు కాశీరాం. తన దగ్గర తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా చెల్లించాలని ఒత్తిడి చేశాడు కాశీరాం. 

కాశీరాం ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. కాశీరాం ఇంటిపైన ఉన్న క్యాబ్స్ ఆఫీసుకు వెళ్లిన శేఖర్ మరొక వ్యక్తి సహాయంతో చేసినట్లు సమాచారం. బెట్టింగ్ లావాదేవీలు కూడా ఈ హత్యకు కారణమై ఉండచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు