టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ కు అరుదైన గౌరవం దక్కింది. బెట్ వే సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా కార్తీక్‌ను ప్రకటించింది. దినేష్ కార్తీక్ కు ఉన్న అనుభవం సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ ను విస్తృతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ లీగ్ భావిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సౌతాఫ్రికా లీగ్ బ్రాండ్ గుర్తింపును పెంచడానికి ఏబీ డివిలియర్స్ తో పాటు మేనేజ్‌మెంట్ బృందంతో కలిసి పని చేస్తారు.
ఈ ఒప్పందం పట్ల కార్తీక్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. "నేను బెట్‌వే సౌతాఫ్రికా 20లో అంబాసిడర్‌గా చేరడం చాలా ఆనందంగా ఉంది. లీగ్ తొలి రెండు సీజన్లు చాలా అద్భుతంగా సాగింది. నేను, గ్రేమ్.. అతని బృందంతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను". అని కార్తీక్ అన్నారు. తమిళనాడుకు చెందిన దినేష్ కార్తీక్ భారత క్రికెట్ తరపున చివరిసారిగా జరిగిన 2022 టీ20 ప్రపంచ కప్ ఆడాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ వరల్డ్ కప్ లో జింబాబ్వే పై తన చివరి మ్యాచ్ ఆడాడు. శనివారం (జూన్ 1,2024) తన పుట్టిన రోజు నాడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.
ఇటీవలే దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. మే22 బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిన అనంతరం కార్తీక్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. గ్రౌండ్ లో ఆయనకు ఆర్సీబీ ప్లేయర్లు, అభిమానులు ఘన వీడ్కోలు పలికారు. మైదానం నుంచి డగౌట్‌కు వెళుతుండగా.. కార్తీక్ తన గ్లౌజులు తీసి ప్రేక్షకులకు అభివాదం చేశాడు.
దినేష్ కార్తీక్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ (2008-2010, 2014)తో ప్రారంభించాడు, ఆ తర్వాత అతను పంజాబ్ కింగ్స్ (2011), ముంబై ఇండియన్స్ (2012-2013), గుజరాత్ లయన్స్ (2016-2017), కోల్‌కతా నైట్ రైడర్స్ (2016 2017 ) కోల్‌కతా నైట్ రైడర్స్ (2018-2021)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2015, 2022-2024) తరుపున ఆడాడు. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు కార్తీక్. 2013లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు కార్తీక్ ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
𝐇𝐞𝐲 @DineshKarthik 👋 𝐖𝐞𝐥𝐜𝐨𝐦𝐞 𝐭𝐨 𝐭𝐡𝐞 #BetwaySA20 😁
— Betway SA20 (@SA20_League) August 5, 2024
PS, we're sure fellow ambassador, @ABdeVilliers17, will show you 𝒂 𝒍𝒆𝒌𝒌𝒆𝒓 𝑺𝒂𝒇𝒇𝒂 𝒆𝒙𝒑𝒆𝒓𝒊𝒆𝒏𝒄𝒆 😉 pic.twitter.com/DiV9TRy6hI