సాధారణంగా పండ్లు, కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదే. కానీ వాటిని తినాల్సిన విధంగా తినకపోతే అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండ్లు. కూరగాయల్లో ఉండే పోషకాలు, ఎంజైమ్ లు వంటివి శరీరానికి అందాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. వాటిని సరిగ్గా ఉడికించపోయినా, కడగకుండా తిన్నా ప్రతికూల ప్రభావాలుంటాయని అంటున్నారు.
కొలోకాసియా ఆకులు
ఆర్బీ కా పట్టా అని పిలిచే ఈ ఆకులను ఆహారంలో వాడే ముందు వాటిని కాసేపు వేడి నీటిలో ఉంచాలి. పచ్చి కొలోకాసియా ఆకులను తింటే ఆరోగ్యానికి ప్రమాదకరం. ఎందుకంటే సహజంగా లభించే పదార్ధాలను తగినంతగా ప్రాసెస్ చేయకపోతే అనర్థాలను కలిగిస్థాయి. పచ్చి కొలోకాసియా ఆకులను పచ్చిగా తీసుకోవడం వల్ల దురద, మంట, వాపు వంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఆకుకూరలు
వీటిలో ఆక్సలేట్ స్థాయిలు అధికంగా ఉండడం వల్ల వీటిని వేడి నీటిలో నుంచి తీసిన తర్వాతే వినియోగించుకోవాలి. దీని వల్ల ఇందులో ఉండే సూక్ష్మ జీవులు, బాక్టీరియా నశిస్తుంది. సాధారణంగా ఈ ఆకులపై సాల్మోనెల్లా వంటి హానికరమైన బాక్టీరియా ఉంటుంది. ఇలా వేడి నీటివో కడగడం వల్ల వీటి నుంచి వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు.
క్యాబేజీ
క్యాబేజీలపై ఉండే అత్యంత శక్తివంతమైన పురుగులు, ఇతర క్రిములను చంపేసేందుకు వేడి నీరు కీలక పాత్ర పోషిస్తుంది. వంటకు ముందు క్యాబేజీని వేడి నీటిలో ఉడకబెట్టడం వల్ల ఈ క్రిముల నుంచి తప్పించుకోవచ్చు.
క్యాప్సికమ్
వంట చేయడానికి ముందు క్యాప్సికమ్ ను వేడి నీటిలో కడగడం మర్చిపోకూడదు. ఇతర పండ్లు, కూరగాయల వలే వీటిని కూడా సూక్ష్మ జీవుల బారి నుంచి బయట పడేందుకు వేడి నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది.
వంకాయ
వంకాయ, టమాటా, బంగాళదుంపలు వంటి కూరగాయలలో సహజంగానే సోలనిన్ ఉంటుంది. ఇది వికారం, వాంతులు, ఇతర జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. వంకాయను సరిగ్గా ఉడకబెట్టడం వల్ల సోలనిన్ విచ్చిన్నమై.. తినడానికి సురక్షితమైనదిగా మారుతుంది.