Microsoft Edge వాడుతున్నారా?.. అయితే ఈ విషయం యూజర్లు తప్పక తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం వినియోగిస్తున్న Microsoft Edge వెర్షన్ల లోపాలున్నాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ (CERT IN) హెచ్చరించింది.
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెర్షన్లలో 129.0.2792.79 కంటే ముందున్న వెర్షనల్లో అనేక భద్రతాలోపాలున్నాయని తెలిపింది.ఈ లోపాలనుంచి రక్షించుకోవడానికి వారి బ్రౌజర్లను లేటెస్ట్ వెర్షన్లతో అప్డేట్ చేసుకో వాలని కోరింది. లేకుండా సైబర్ నేరగాళ్ల బారినపడే అవకాశం ఉందని హెచ్చరించింది.
CERT in ప్రకారం.. మోజోలో డేటా సరియూన వాలిడేషన్ లేకపోవడం, V8 జావా స్క్రిప్ట్ ఇంజిన్ లో సరియైన అమలుతీరు లేకపోవడం, బ్రౌజర్ లేఅవుట్ కాంపోనెంట్‌లో ఇంటిజర్ ఓవర్‌ఫ్లో వంటి లోపాలను గుర్తించారు. ఈ లోపాలను వినియోగించుకొని ఫ్రాడ్ స్టర్లు సైబర్ నేరాలకు పాల్పడవచ్చని తెలిపింది.
యూజర్లు వ్యక్తిగత డేటాను దొంగిలించే అవకాశం ఉంది. ఈలోపాలను సరిచేయకపోతే పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉల్లంఘనలకు దారితీయవచ్చు. వెంటనే యూజర్లు తమ బ్రౌజర్‌లను తాజా వెర్షన్‌కి అప్డేట్ చేయమని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.