Aadhaar Alert: AIతో మార్కెట్లోకి నకిలీ ఆధార్ కార్డులు.. తెలివిగా గుర్తించండిలా..?

Aadhaar Alert: AIతో మార్కెట్లోకి నకిలీ ఆధార్ కార్డులు.. తెలివిగా గుర్తించండిలా..?

Fake Aadhaar Card: ఏఐ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి దానిని కొందరు అతిగా దుర్వినియోగానికే ఉపయోగిస్తున్నారు. పైగా రోజురోజుకూ కొత్త మోసాలు పెరిగిపోవటం ప్రజలకు ఆర్థిక భద్రతను తగ్గిస్తోంది. ప్రస్తుతం నిందితులు ఏఐని నకిలీ ఆధార్ కార్డుల తయారీ కోసం కూడా వినియోగించటం కొత్త సమస్యలను తెచ్చిపెట్టనుంది. 

ప్రముఖ ఏఐ టూల్ చాట్ జీపీటీ కొత్త ఫీచర్లను కొందరు తప్పుడు పనులకు ఉపయోగించటం కొత్త ప్రమాదాలను తీసుకొస్తోంది. కొందరు సోషల్ మీడియా యూజర్లు ఏఐ సాంకేతికతను ప్రస్తుతం నకిలీ ఆధార్ కార్డ్ ఫొటోలను సృష్టించటానికి ఉపయోగించటం ప్రారంభించినట్లు తేలింది. దీంతో ఏఐ కంపెనీలు ఇలాంటి వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఫోటోరియలిస్టిక్ ఫోటోలను సృష్టించగల సామర్థ్యం చాట్ జీపీటీకి రావటంతో అచ్చం ఆధార్ కార్డు లాంటి ఫొటోలను వినియోగదారులు సృష్టిస్తున్నట్లు వెల్లడైంది. ఇవి ప్రభుత్వం అందించే అధికారిక కార్డుల కంటే కేవలం కొంత భిన్నంగా మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. 

Also Read:-బ్లాక్ ఫ్రైడే.. సెన్సెక్స్ 930 పాయింట్లు క్రాష్, రూ.10 లక్షల కోట్లు ఫసక్..

ఈ క్రమంలో కొందరు యూజర్లు ఏఐ టూల్ చాట్ జీపీటీతో సృష్టించిన ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్‌మాన్ ఆధార్ కార్డులను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇందులో క్యూఆర్ కోడ్, ఆధార్ నంబర్, చిరునామా వంటి వివరాలు కూడా అచ్చం నిజమైన ఆధార్ కార్డుల్లో మాదిరిగానే నమోదయ్యాయి. 

ఫేక్ ఆధార్ కార్డులను గుర్తించే ప్రక్రియ..
* ఏఐ వినియోగించి జనరేట్ చేయబడిన నకిలీ ఆధార్ కార్డుల్లో ఫొలో కొద్దిగా తేడాను కలిగి ఉంటుంది
* అలాగే ఒరిజినల్ ఫేక్ ఆధార్ కార్డులపై ఉపయోగించిన ఇంగ్లీష్, హిందీ ఫాంట్ మార్పులను కలిగి ఉంటుంది లేదా ఒకేలా ఉండదు.
* ఆధార్ కార్డులో ఉపయోగించే కామాలు, కాలన్స్, శ్లాష్ తేడాలను కలిగి ఉండాయి
* కార్డుపై ఉండే ప్రభుత్వ-ఆధార్ లోగోల్లో తేడాలను గమనించాలి
* నకిలీ ఆధార్ కార్డును గుర్తించటానికి క్యూఆర్ కోడ్ సరైనదో కాదో గమనించాలి.