మొబైల్ ఫోన్లో మనం వాడే అప్లికేషన్స్ అన్నీ సేఫేనా అంటే కచ్చితంగా అవునని మాత్రం చెప్పలేం. ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా మొదటిగా అడిగేది మన ఫోన్లో ఉండే ఫైల్స్, ఫొటోస్, కాల్స్ డేటా గురించే. యాప్ డౌన్లోడ్ చెయ్యగానే టర్న్మ్, కండిషన్స్ ఏవీ చూడకుండానే అన్నింటికి ఓకే కొట్టెస్తాం. ఆ తర్వాత మొదలవుతాయి కష్టాలు. అందుకే యాప్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లో ఉన్న లక్షల కొద్దీ యాప్స్ లో మనకు పనికి వచ్చేవి చాలానే ఉన్నాయి. దాదాపుగా ప్రతీ ప్రాబ్లంకీ ఒక సొల్యూషన్ అన్నట్టు మనకు ఏది కావాలన్నా దానికి సంబంధించిన యాప్ ఉంటోంది. అయితే యాప్స్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు ఉన్నాయి. నకిలీ యాప్స్ తో పాటు కొన్ని అప్లికేషన్స్ లో యూజర్ల డేటా లీక్ చేయడం, అతిగా యాడ్స్ పోస్ట్ చేయడం, బ్యాంక్ అకౌంట్ వివరాలు కాజెయ్యడం లాంటి సమస్యలు తెస్తూనే ఉంటాయి. అలాంటి ప్రమాదకరమైన అప్లికేషన్స్ గురించి సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు గుర్తించి అలాంటి యాప్స్ వాడొద్దని హెచ్చరిస్తుంటాయి. అలాంటి కొన్ని యాప్స్ ని సెక్యూరిటీ దిగ్గజం అవెస్ట్ గుర్తించి, ఆ యాప్స్ ని తొలగించుకొమ్మని ఒక లిస్ట్ బయట పెట్టింది. ఇప్పటికే ఈ యాప్స్‌ని లక్షలాది మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని అంచనా. వీటిని డౌన్‌లోడ్ చేసుకోవద్దని అవెస్ట్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకొని ఉంటే అన్‌ఇన్‌స్టాల్ చేయమని, ఏవైనా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్ చేసినట్టైతే ఆ సబ్‌స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోమని చెబుతోంది. ఆ లిస్ట్ ఇదే..
1.స్కిన్స్, మూడ్స్, మ్యాప్స్ ఫర్ మైన్‌క్రాఫ్ట్ PE2
2.లైవ్ వాల్ పేపర్స్ HD &3D బ్యాక్‌గ్రౌండ్
3.స్కిన్ ఫర్ రెబొలక్స్
4.మాస్టర్ క్రాఫ్ట్ ఫర్ మైన్‌క్రాఫ్ట్
5.బాయ్స్ అండ్ గాళ్స్ స్కిన్స్
6.మ్యాప్స్ స్కిన్స్ అండ్ మోడ్స్ ఫర్ మైన్‌క్రాఫ్ట్
ఈ యాప్స్ కానీ, మైన్‌క్రాఫ్ట్ సంబంధ ఏ అప్లికేషన్స్‌ని కానీ డౌన్లోడ్ చేసుకోవద్దని, ఆ యాప్స్ ఫోన్లలో ఉన్నా వాటిని డిలీట్ చేయాలని చెప్పింది అవెస్ట్.