Tech Alert : మీ పిల్ల‌లు స్మార్ట్ వాచ్ వాడుతున్నారా.. కిడ్నాప్ అయ్యే అవ‌కాశం.. జాగ్ర‌త్త పేరంట్స్

Tech Alert : మీ పిల్ల‌లు స్మార్ట్ వాచ్ వాడుతున్నారా.. కిడ్నాప్ అయ్యే అవ‌కాశం.. జాగ్ర‌త్త పేరంట్స్

మీ పిల్లలకు స్మార్ట్  వాచ్ కొనిస్తున్నారా? ఎందుకు? ఎక్కడున్నారో తెలుసుకునేందుకేగా? స్మార్ట్ వాచ్ ఉంటే మీ పిల్లలు సేఫ్ అనుకుంటున్నారా? మీ  ఆలోచన తప్పు. ఎందుకంటే స్మార్ట్ వాచ్  కారణంగానే పిల్లలు కిడ్నాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు సైబర్ నిపుణులు. భద్రత పేరుతో కొంటున్న స్మార్ట్ వాచ్ లే పిల్లలకు భద్రత లేకుండా చేస్తున్నాయని చెబుతున్నారు.

ఎందుకంటే స్మార్ట్ వాచ్ లను చాలా ఈజీగా హ్యాక్ చెయ్యొచ్చట.. ప్రముఖ బ్రాండ్ లకు చెందిన పిల్లల స్మార్ట్ వాచ్లను నార్వేకు చెందిన నేషనల్ కస్టమర్ కౌన్సిల్ (ఎన్ సీ సీ) పరీక్షించింది. ఈ వాచ్  లు   ఇంటర్నెట్ తో అనుసంధానమై ఉన్నందున హ్యాకర్లు, కిడ్నాపర్లు వాచ్ ఉన్న ప్రాంతాల‌ను సులభంగా గుర్తిస్తారని.. ఫలితంగా పిల్లలు ఏ సమయానికి ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోవచ్చని చెబుతున్నారు. అంతేకాదు.. వాచ్ ను పెట్టుకున్న పిల్లలు తల్లిదండ్రులతో, స్నేహితులతో ఏం మాట్లాడుతున్నారో కూడా ఈజీగా వినొచ్చని చెబుతున్నారు.

ALSO READ : మొబైల్స్​​ మన మాటలు వింటాయా?..

వాచ్ ఉన్న జీపీఎస్ లొకేషన్ ను చేంజ్ చేసి, తల్లిదండ్రులను కూడా మరోచోటుకు రప్పించవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. ఎన్ క్రిప్ట్ అవ్వకుండానే సైబర్ నేరగాళ్లు ఇవన్నీ చేసేందుకు వీలుందని, వీలైనంత వరకు పిల్లల భద్రత కోసం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై ఆధారపడకుండా ఉండడమే మేలని చెబుతున్నారు. ఎన్ సీ సీ రిపోర్ట్ పై స్పందించిన ప్రముఖ వాచ్ రిటైలింగ్ సంస్థ జాన్ లెవిస్ పిల్లల స్మార్ట్ వాచీ అమ్మకాలను సైతం నిలిపివేసింది.

... వెలుగు లైఫ్