
పొగ తాగనోడు దున్నపోతై పుట్టున్ అనే సామెత ఏమోగానీ.. బుర్ర షార్ప్ గా పని చేయాలంటే ఓ సిగరెట్ ఎలిగిస్తే చాలు.. షార్ప్ గా ఆలోచనలు వస్తాయనేది స్మోకర్స్ మాట.. దమ్ముకొడితే కంటెంట్ దుమ్ము దులపొచ్చు అనే ఆలోచన తప్పంట.. ఎక్కువగా తాగితే అదే బుర్ర పాడైపోతుందని చెబుతున్నారు డాక్టర్లు..
ధూమపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలిసిన విషయమే. క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి ఈ అలవాటును వీలైనంత త్వరగా మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ధూమపానం వల్ల ఊపిరితిత్తులకు ప్రమాదమన్నది అందరికీ తెలిసిందే. కానీ తాజాగా అధ్యయనం ప్రకారం తెలిసిందేమిటంటే.. ఈ అలవాటు వల్ల మెదడు పరిమాణం తగ్గుతుంది.
రోజూ ధూమపానం చేసేవారి మెదడు ఎప్పుడూ ధూమపానం చేయని వారి కంటే 0.4 క్యూబిక్ అంగుళాలు చిన్నగా ఉంటుంది కొత్తగా చేసిన పరిశోధనలో తేలింది. దీని కోసం, శాస్త్రవేత్తలు స్వయంగా.. ధూమపాన అలవాట్లున్న వారిని సమీక్షించారు. ఈ అధ్యయనంలో UK బయోబ్యాంక్‌కు చెందిన ఓ శాస్త్రవేత్త వ్యక్తుల మెదడు స్కాన్‌లను విశ్లేషించారు. ఈ పరిశోధన కోసం 2006-2010, 2012-2013 మధ్య సర్వేలు చేశారు. రెండో దశలో ఎంఆర్‌ఐ కూడా చేయించుకున్న వారిని కూడా పరిశీలించారు. ఎప్పుడూ ధూమపానం చేయని వారి కంటే ఎక్కువ మెదడు వాల్యూమ్ కలిగి ఉన్నట్లు ఆయన గుర్తించారు.
మెదడులో చేరిన బూడిద పదార్థం.. భావోద్వేగం, జ్ఞాపకశక్తిపైనా తీవ్ర ప్రభావం చూపించనున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ధూమపానం ఫ్రీక్వెన్సీ మెదడు సంకోచంపై బలమైన ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు.
మెదడు సంకోచం అంటే ఏమిటి?
మెదడు సంకోచం అంటే మస్తిష్క క్షీణత లేదా మెదడు కుంచించుకుపోవడం. ఇది వయస్సు ఓవర్ టైం తో జరుగుతుంది. దీని లక్షణాలు:
- కండరాల నష్టం
- మసక దృష్టి
- దిక్కుతోచని స్థితి
- సమన్వయం కోల్పోవడం
- కండరాల బలహీనత
- అల్జీమర్స్ వ్యాధి
ధూమపానం శాశ్వతంగా మానేయడం ఎలా ?
శాశ్వతంగా ధూమపానం మానేయడానికి, సిగరెట్ లేకుండా జీవించడానికి మెదడు, శరీరాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం:
- నికోటిన్ పాచెస్ ఉపయోగించండి
- వ్యాయామం
- కోరికలను అధిగమించడానికి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి