ఓ డైమండ్ రింగ్ కథ
టైటిల్ : భాగ్ సాలే
కాస్ట్ : శ్రీ సింహ, రాజీవ్ కనకాల, జాన్ విజయ్, నేహా సోలంకి, జాన్ విజయ్, పృథ్వీ, వైవా హర్ష, సుదర్శన్, నందిని రాయ్
లాంగ్వేజ్ : తెలుగు
డైరెక్షన్ : ప్రణీత్ బ్రహ్మాండపల్లి
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
అర్జున్ (శ్రీ సింహ) మిడిల్ క్లాస్ కుర్రాడు. ఒక స్టార్ హోటల్లో చెఫ్‌గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా ఒక రెస్టారెంట్ పెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది అతని కోరిక. అందుకోసం వాళ్ల నాన్న (రాజీవ్ కనకాల)కి ఎంతో ఇష్టమైన సొంత ఇంటిని అమ్మాలనుకుంటాడు. అంతేకాదు, ఆ కలల్లో బతుకుతూ ధనవంతుడి కొడుకు అని నమ్మించి మాయ(నేహా సోలంకి)ని ప్రేమలో పడేస్తాడు. అయితే సడెన్‌గా మాయ ఇంటికి శామ్యూల్ (జాన్ విజయ్) అనే డాన్ తన గ్యాంగ్‌తో వస్తాడు.
తనకు కావాల్సిన డైమండ్ రింగ్ మాయ వాళ్ల నాన్న దగ్గర ఉందని తెలిసి ఆయన్ని కిడ్నాప్ చేస్తాడు. ఆ రింగ్ వల్ల ఎవరి జీవితాలు ఎఫెక్ట్ అయ్యాయి? మోసం చేసి మాయకి దగ్గరైన అర్జున్ ప్రేమ గెలిచిందా? లేదా? అనేది మిగతా కథ. ఈ సినిమా కాస్త స్లోగా స్టార్ట్ అయినా కథలోకి వెళ్లేకొద్దీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. స్టోరీ, డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి.