భద్రాచల రామయ్య హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు

భద్రాచల రామయ్య హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు

భద్రాచలం,వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ  ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 36 రోజులకు రూ.1,31,84, 181 ఆదాయం వచ్చింది. చివరిసారి మార్చి 27న హుండీలు లెక్కించారు. 25 యూఎస్ ​డాలర్లు, 55 యూఏఈ థీరమ్స్, 10 ఇంగ్లాండ్​ పౌండ్స్, 20 థాయిలాండ్​ భాట్స్, 17 సౌదీ రియాల్స్​తో పాటు వెండి 1.450 కిలోలు, 230 గ్రాముల బంగారం వచ్చినట్లు ఈవో రమాదేవి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత నెల 17వ తేదీన శ్రీరామనవమి, 18న శ్రీరామ మహాపట్టాభిషేకం నిర్వహించగా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయానికి ఆదాయం పెరిగింది.