మావోయిస్టు ప్రభావిత గ్రామాలను సందర్శించిన ఏఎస్పీ

మావోయిస్టు ప్రభావిత గ్రామాలను సందర్శించిన ఏఎస్పీ

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్​కుమార్​ సింగ్​ గురువారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్​లో భాగంగా ఛత్తీస్​గఢ్​ బార్డర్​లోని చర్ల మండలం బట్టిగూడెం, రామచంద్రాపురం గ్రామాల్లో పర్యటించారు. ప్రతీ ఇంటిని సందర్శించి వారి యోగక్షేమాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి ఎవరూ సహకరించొద్దని సూచించారు.

గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామ సమస్యలను పోలీసులకు వివరించాలని, పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఆర్​పీఎఫ్​ అసిస్టెంట్ కమాండెంట్​రాజ్​ కుమార్, చర్ల సీఐ రాజువర్మ, ఎస్సై నర్సిరెడ్డి పాల్గొన్నారు.