భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం భద్రాచలానికి చెందిన భక్తులు బంగారు హారాన్ని సమర్పించారు. కొంజర్ల సుబ్రహ్మణ్యం, కృష్ణకుమారి దంపతులు 63 గ్రాములతో రూ.4లక్షలు వెచ్చించి బంగారు హారాన్ని తయారు చేయించారు. దీనిపై ముత్యాలతో శ్రీరామ అని నామం రూపొందించారు. ప్రత్యేక పూజలనంతరం ఈ హారాన్ని ఆలయానికి అందజేశారు.
అలాగే హైదరాబాద్కు చెందిన పొన్నూరి ఉమా సుకన్య స్వామికి వెండిపై బంగారు పూతపోసిన రెండు హారాలను అందజేశారు. వీటి విలువ రూ.72వేలు ఉంటుంది. ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాకకు చెందిన భక్తులు నిమ్మగడ్డ కిషోర్, క్రాంతి దంపతులు సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళంగా ఇచ్చారు.