భద్రాచలం, వెలుగు : భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 15వ నేషనల్ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం స్పెషల్ అవార్డును అందజేశారు.2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బెల్లంపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా విజయవంతంగా విధులు నిర్వర్తించినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డును అందజేశారు.
రెడ్డిగూడెం యువతి..
అశ్వారావుపేట : జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించిన కొండరెడ్ల కులస్తులు గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఓటు హక్కు వినియోగం పై మాట్లాడేందుకు భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ మారుమూల గిరిజన గ్రామమైన అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఉమ్మల సరోజిని, యాట్ల సందీప్ రెడ్డిని హైదరాబాద్లోని రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమానికి పంపించారు. వారి స్పీచ్ ను మెచ్చి గవర్నర్ అవార్డు ప్రదానం చేశారు.