భద్రాచలం, వెలుగు: ఆదివాసీలకు చేరువయ్యేందుకు భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ వినూత్నంగా ఆలోచిస్తున్నారు. గతంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోయ భాషలో ప్రసంగించి అందరినీ మెప్పించారు. స్వయంగా కోయభాషను నేర్చుకుని ఫీల్డ్ లెవల్ విజిట్‌కు వెళ్లినప్పుడు గ్రామాల్లోని ఆదివాసీలతో వారి భాషలోనే మాట్లాడుతున్నారు.
తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఇచ్చే ప్రశంసాపత్రాలను కోయభాషలో ముద్రించారు. ఆదివాసీ ఆచార, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు, కోయ భాషపై నేటి యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేపట్టినట్లు పీవో రాహుల్ తెలిపారు. ఆయన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు.