భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మిథులా స్టేడియంలో సీతారాముల కల్యాణ వేడుకను వేదపండితులు ఘనంగా నిర్వహించారు. గోదావారి జలాలతో కల్యాణ వేదిక శుద్ది చేశారు. రామదాసు చేయించిన ఆభరణాలు.. రామయ్యకు పచ్చలహారం, సీతమ్మకు చింతాకు పతకంతో అలంకరించారు. రామదాసు చేయించిన మంగళసూత్రంతో అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణాన్ని వేద పండితులు జరిపించారు. సీతారాములవారికి వేద పండితులు ముత్యాల తలంబ్రాలు పోశారు.
Also Read: అయోధ్యలో అద్భుతం.. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు..
కల్యాణ వేడుకకు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు. ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి పట్టు వస్త్రాలు సమర్పించారు.రాములోరి కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణం ను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పొటెత్తారు. భద్రాచలం వీధులన్నీ శ్రీరామనామస్మరణతో మార్మోగాయి.