భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగింది. ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీ సీనియర్‌నేతలు తాండ్ర వెంకటరమణ, రేపాక పూర్ణచంద్రరావు, వెంకటరమణ, శ్రీనివాస్, మల్లేశ్, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, భద్రాచలం టౌన్‌మాజీ అధ్యక్షుడు బొలిశెట్టి రంగారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాండ్ర నర్సింహారావు, బీసీ సెల్ డివిజన్అధ్యక్షుడు హన్మంతరావు
ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఉబ్బా వేణు, రమేశ్, ఎస్టీ సెల్‌రాష్ట్ర కార్యదర్శి తెల్లం నరేశ్‌తోపాటు జడ్పీటీసీ పుష్పలత, ఎంపీపీ శ్యామల, చర్ల ఎంపీపీ కోదండ రామయ్య, వాజేడు జడ్పీటీసీ వర్సా చిన్నారావు, కొత్తపల్లి సర్పంచ్గుండి వెంకటేశ్వర్లు, కొత్తపల్లి ఎంపీటీసీ పూసం ధర్మరాజు, నడికుడి ఎంపీటీసీ సోడి తిరుపతిరావు, ప్రగళ్లపల్లి ఎంపీటీసీ మడకం రామారావు, వట్టిగూడెం సర్పంచ్సరియం సీతారాములు, అంజుపాక సర్పంచ్ మడకం నాగేంద్ర తదితరులు బీఆర్ఎస్లో చేరారు. మూకుమ్మడిగా ముఖ్య నేతలంతా పార్టీని వీడడంతో భద్రాద్రి కాంగ్రెస్‌లో కలకలం రేగింది.
ALSO READ: విగ్రహాలు కొనివ్వడం మొదలు నిమజ్జనం దాకా దగ్గరుండి ఏర్పాట్లు
స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్యనే భద్రాద్రికొత్తగూడెం జిల్లా కాంగ్రెస్అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన నియోజకవర్గం నుంచే ఎక్కువ మంది పార్టీని వీడడంపై హైకమాండ్ ఆరా తీస్తోంది. ఎమ్మెల్యే చుట్టూ ఉన్న కోటరీతో ఇమడ లేకనే బ్లాక్కాంగ్రెస్అధ్యక్షులు రమేశ్‌గౌడ్, బొలిశెట్టి రంగారావు, సీనియర్లీడర్లు తాండ్ర వెంకటరమణ, నర్సింహారావు, అనుబంధ సంఘాల అధ్యక్షులు పార్టీ మారినట్లు నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది.
దీనికితోడు దుమ్ముగూడెంకు చెందిన తెల్లం నరేశ్, వేణును ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపించి సస్పెండ్‌చేశారు. ఈ పరిణామం కూడా పార్టీని దెబ్బ తీసినట్లయింది. మండలంలో వీరిద్దరికి పట్టు ఉంది. గత ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో బాగా కష్టపడ్డారు. వీరు కూడా గులాబీ జెండాను కప్పుకున్నారు.