
భద్రాచలం, వెలుగు : తెలంగాణ స్టేట్ యునైటెడ్ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్యూనియన్(యూఈఈయూ -సీఐటీయూ) డైరీ, క్యాలండర్‌ను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం ఆవిష్కరించారు. స్థానిక రాజులసత్రంలో జరిగిన కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఈశ్వరరావు, నలువాల స్వామి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌సంస్థల్లో పనిచేస్తున్న 20వేల మంది ఆర్జిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని, సంస్థలోని ఉద్యోగులు, కార్మికులకు జీపీఎఫ్ నుంచి ఈపీఎఫ్‌కు మార్చాలని కోరారు. aకాగా ఎమ్మెల్యే తెల్లం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన వాహనంలో వెళ్తూ రోడ్డు పక్కన ఆపి బండిపై అమ్ముతున్న టిఫిన్ తిన్నారు. ఇది చూసిన పట్టణ ప్రజలు ఆయన సింప్లిసిటీని అభినందించారు.