వానాకాలం నాటికి కరకట్ట పూర్తవ్వాలి : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

వానాకాలం నాటికి కరకట్ట పూర్తవ్వాలి : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం, వెలుగు: వానాకాలం నాటికి కరకట్ట పనులు పూర్తవ్వాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్​ ఇంజినీర్లతో సంబంధిత పనులపై రివ్యూ చేశారు. నేషనల్​ హైవే నుంచి రావాల్సిన అనుమతి కోసం చేపట్టిన సాయిల్ టెస్ట్​వివరాలను అధికారులు ఆయనకు వివరించారు.

వానాకాలంలోపే రెండు వైపులా కరకట్ట, గేట్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఈఈ జానీ, డీఈలు మధుసూదన్​రావు, తిరుపతిరెడ్డి తదితరులున్నారు.