అంగన్​వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తాం : తెల్లం వెంకట్రావ్

అంగన్​వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తాం : తెల్లం వెంకట్రావ్

వెంకటాపురం, వెలుగు: అంగన్​వాడీ కేంద్రాలను కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్​ అన్నారు. శనివారం ఆయన ములుగు జిల్లా కలెక్టర్ దివాకరతో కలిసి వెంకటాపురం, వాజేడు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేశారు.

 అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంకటాపురం, వాజేడు ఏజెన్సీ మండలాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, ఏండ్ల తరబడి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి మరిన్ని అభివృద్ధి పనులను మంజూరు చేస్తామన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ వెంకటేశ్, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ సర్దార్ సింగ్, జిల్లా సంక్షేమ అధికారిణి శిరీష, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.