- భద్రాచలం మన్యం వీరుడు మోడెం వంశీ ఘనత
భద్రాచలం, వెలుగు : సౌతాఫ్రికాలోని సన్ సిటీలో ఈనెల 4 నుంచి 13 వరకు జరిగిన కామన్ వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఇండియాకు బంగారు పతకాన్ని భద్రాచలం మన్యానికి చెందిన మోడెం వంశీ అందించారు. ఈ పోటీలలో పాల్గొని మొత్తం 677.5 కేజీల బరువును ఎత్తి స్ట్రాంగెస్ట్ మాన్ ఆఫ్ వరల్డ్ మెరిట్ సర్టిఫికెట్‌ను వంశీ సాధించాడు. బెంచ్ ప్రెస్, డెడ్‌లిఫ్ట్, స్క్వాట్ విభాగాల్లో మూడు బంగారు పతకాలతో పాటు పవర్ లిఫ్టింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు బంగారు పతకం అందుకున్నాడు.
గతంలో కూడా యూరప్‌లోని మాల్దాదేశంలో జరిగిన ఇంటర్నేషనల్పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్న ఈ గిరిజన యువకుడు బంగారు పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా వంశీని భద్రాద్రి వాసులు అభినందించారు.