సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు బుధవారం ప్రాకార మండపంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ముందుగా గర్భగుడిలో సుప్రభాత సేవ అనంతరం మూలవరులకు బాలబోగం నివేదించాక ఉత్సవమూర్తులను మేళతాళాలతో ప్రాకార మండపానికి తీసుకెళ్లారు.
అక్కడ అర్చకులు పంచామృతాలు, సమస్త నదీజలాలతో అభిషేకం చేశాక బేడా మండపంలో కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం జరిగింది. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ నిర్వహించి సీతారామయ్యకు ప్రత్యేక హారతిని ఇచ్చారు.
- భద్రాచలం, వెలుగు