ఏపీ నుంచి పూణెకు వయా తెలంగాణ.. రూ. 53 లక్షల గంజాయి స్వాధీనం

భద్రాచలంలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  ఏపీ నుంచి పూణేకు వాహనాల్లో  తరలిస్తున్న గంజాయిని  భద్రాచలం  RTO చెక్ పోస్ట్  దగ్గర తనిఖీలు చేస్తుండగా పట్టుకున్నారు. ఏపీ  డొంకరాయి నుంచి మహారాష్ట్రలోని పూణేకు 210 కిలోల గంజాయిని  కారులో తరలిస్తుండగా భద్రాచలం ఆర్టీవో చెక్ పోస్ట్ దగ్గర భద్రాచలం ఎక్సైజ్  సీఐ  రహీం ఉన్నిసా బేగం  సిబ్బంది కలిసి నవంబర్ 28న  పట్టుకున్నారు.   

Also Read :- 80 తులాల బంగారం, 2 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..  పట్టుకున్న 210 కేజీల గంజాయి విలువ రూ 53 లక్షలు ఉంటుందని గుర్తించారు.   గంజాయితోపాటు ఐదు లక్షల విలువ చేసే కారు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు.  గంజాయిని పట్టుకున్న  భద్రాచలం ఎక్సైజ్ పోలీసులను  సీఐ రహీం ఉన్నిసా బేగం, ఎస్సై అల్లూరి సీతారామరాజు  సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టర్  విబి కమలహాసన్ రెడ్డి, జాయింట్ కమిషనర్ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్ జి గణేష్  అభినందించారు.