స్వాముల ముసుగులో గంజాయి రవాణా

  • గుట్టురట్టు చేసిన భద్రాద్రి పోలీసులు

భద్రాచలం, వెలుగు : స్వాముల ముసుగులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును భద్రాచలం పోలీసులు రట్టు చేశారు. సీఐ నాగరాజురెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం కూనవరం రోడ్డులో సీఆర్​పీఎఫ్​ క్యాంపు సమీపంలో పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

దేవుడి రథంలో వెళ్తున్న స్వాములపై అనుమానం వచ్చి రథాన్ని తనిఖీ చేశారు. అందులో 484 కిలోల గంజాయి పట్టుబడింది. ఛత్తీస్​గఢ్,​ -ఒడిశా సరిహద్దుల నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు తేల్చారు. స్వాముల వేషంలో ఉన్న ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.