భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆభరణాల లెక్కింపు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. ఇటీవల దేవస్థానం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఎల్.రమాదేవి మాజీ ఈవో శివాజీ నుంచి ఆభరణాలు స్వాధీనం చేసుకునే క్రమంలో భాగంగా బంగారు, వెండి ఆభరణాల లెక్కింపు జరుగుతోంది. హైదరాబాద్ఎండోమెంట్ జ్యువెలరీ వెరిఫికేషన్ఆఫీసర్, అసిస్టెంట్ కమిషనర్ అంజనీదేవి పర్యవేక్షణలో ఆభరణాల లెక్కింపు సాగుతోంది.
అంతకుముందు శ్రీసీతారామచంద్రస్వామికి పట్టాభిషేకం నిర్వహించారు. శ్రీరామ పునర్వసు దీక్ష విరమణ తర్వాత ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ. విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, య జ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, త లంబ్రాల వేడుక, మంత్రపుష్పం వరుస క్రమంలో జరిగాయి. సమస్త నదీజలాలతో ప్రోక్షణ చేశారు. స్వామికి కత్తి, డాలు, రాజముద్ర, కిరీటం అలంక