శ్రీకృష్ణావతారంలో భద్రాద్రి రామయ్య

భద్రాచలం, వెలుగు: పగల్ పత్ ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి శనివారం శ్రీకృష్ణావతారంలో దర్శనమిచ్చారు. ముందుగా గర్భగుడిలో రామయ్యకు విశేష పూజలు జరిగాయి.  రామపాదుకలకు పంచామృతాలతో అభిషేకం చేసి, మూలవరులకు సువర్ణ తులసీదళ అర్చన నిర్వహించారు.  తర్వాత స్వామిని శ్రీకృష్ణుడిగా అలంకరించారు. అనంతరం శ్రీకృష్ణావతార రామయ్యను ఊరేగింపుగా వైకుంఠ ద్వారం ఎదురుగా ఉన్న అధ్యయన వేదికపైకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత తిరువీధి సేవగా తాతగుడి సెంటర్​లోని గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లి సేవలందుకున్నారు. అక్కడి నుంచి రాజవీధి గుండా ఆలయానికి చేరుకున్నారు.