భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో నిత్య అన్నదానానికి ఆదివారం విరాళాల రూపంలో రూ.13లక్షల70లక్షలు వచ్చాయి. ఏపీలోని రాజమండ్రికి చెందిన డీఎస్ఎం లక్ష్మి రూ.10 లక్షలు, గురుడా నాగేంద్రవరప్రసాద్, శాంతిశ్రీ దంపతులు రూ.1,00,002, రామాలయం ఆస్థాన విద్వాంసులు మున్నంగి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులు రూ.70,101 ఇచ్చారు.
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన సుబ్రహ్మణ్యం రూ.లక్ష, సికింద్రాబాద్రామచంద్రకాలనీకి చెందిన నండూరి సీతారామయ్య రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. నిత్య పూజల్లో భాగంగా ఆదివారం శ్రీసీతారామచంద్రస్వామి మూలవరులకు పంచామృతాలతో అభిషేకం, సువర్ణ పుష్పార్చన చేశారు. పవిత్రోత్సవాల్లో పవిత్రాధివాసం నిర్వహించారు.