
భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని 44 రోజుల తర్వాత బుధవారం లెక్కించగా రూ. 60,81,779 వచ్చాయి. అంతేకాకుండా 94 గ్రాముల బంగారం, 555 గ్రాముల వెండి, 288 యూఎస్డాలర్లు, 410 యూఏఈ దీరమ్స్, 60 కెనడా డాలర్లు,10 ఇంగ్లాండ్ పౌండ్స్, 50 నేపాల్రూపీస్, 100 ఒమన్ రియల్స్ విదేశీ కరెన్సీ కూడా భక్తులు సమర్పించారు.
అనంతరం సీతారాముల కల్యాణం నిర్వహించారు. పాల్వంచకు చెందిన శ్రీనివాసరాజు తన తల్లిదండ్రులు పుల్లంరాజు, అన్నపూర్ణల పేరిట నిత్యాన్నదాన పథకానికి రూ.1 లక్ష విరాళం అందజేశారు. ఖమ్మంలో మున్నేరు వరద బాధితుల కోసం దేవస్థానం తరపున10వేల అన్నం ప్యాకెట్లను పంపిణీ చేశారు.