భద్రాచలంలో బ్రేక్‌‌ దర్శనాలు

భద్రాచలంలో బ్రేక్‌‌ దర్శనాలు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో బ్రేక్‌‌ దర్శనాలను ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటలు, రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల మధ్య రూ.200ల టికెట్‌‌పై బ్రేక్‌‌ దర్శనం కల్పించనున్నారు. 

జులై 2 నుంచి ఈ బ్రేక్‌‌ దర్శనాలు ప్రారంభిస్తామని ఈవో రమాదేవి తెలిపారు. బ్రేక్‌‌ దర్శన టైంలో ఉచిత, స్పెషల్‌‌ దర్శనం, అంతరాలయాల అర్చనలు నిలిపివేయనున్నారు చెప్పారు. అలాగే మెయిన్‌‌ టెంపుల్‌‌, అన్నదాన సత్రంలో 90 కిలోవాట్ల కెపాసిటీ కలిగిన సోలార్‌‌ విద్యుత్‌‌ ప్లాంట్‌‌ను ఈవో ప్రారంభించారు.