మైసూరులో రామయ్య కల్యాణం.. భద్రాద్రికి పోటెత్తిన భక్తులు

భద్రాచలం, వెలుగు: కర్నాటకలోని మైసూరు పట్టణంలో ఆదివారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మైసూరు భక్తుల కోరిక మేరకు ఈవో రమాదేవి ఆధ్వర్యంలో రామరథంలో సీతారాముల కల్యాణమూర్తులను తీసుకెళ్లారు. భద్రాద్రి సీతారాముల వారికి ఘనస్వాగతం పలికారు.

 కల్యాణం వీక్షించిన భక్తులు పులకించారు. కాగా, వీకెండ్​ కారణంగా భద్రాచలం రామాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. గర్భగుడిలో సీతారాముల మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేసి, బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. బేడా మండపంలో నిత్య కల్యాణం చేశారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.