- అతడితోపాటు కుమారుడిని సస్పెండ్ చేసిన అధికారులు
- ఉత్తర్వులు జారీ చేసిన ఈవో రమాదేవి
- కోడలి ఫిర్యాదుతో తాడేపల్లి గూడెంలో కేసు నమోదు తో చర్యలు
భదాద్రి కొత్తగూడెం: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి టెంఫుల్ ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామచంద్రాచార్యులు, అతని కొడుకు సీతారాంపై దేవాదాయశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆలయ డ్యూటీల నుంచి వారిద్దరినీ సస్పెండ్చేస్తూ టెంఫుల్ ఈవో ఎల్ రమాదేవి ఉత్వర్తులు జారీ చేశారు. తన కోడలు ప్రసన్న పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. తాడేపల్లి గూడెం పీఎస్లో కంప్లైట్అందిన నేపథ్యంలో అధికారులు వారిపై చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
కోడలు ఆత్మహత్యాయత్నం..
భద్రాచలం టెంఫుల్లో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న పొడిచేటి సీతారామచంద్రాచార్యులు, అతని దత్తపుత్రుడు సీతారాంకు తాడేపల్లి గూడెంకు చెందిన ప్రసన్నతో మ్యారేజీ అయింది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా మామ రామచంద్రాచార్యులు తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ..కంప్లైట్చేసింది.
రూ.10 లక్షలను వరకట్నం తీసుకురావాలని, లేదంటే తన కొడుకుకు వేరే అమ్మాయితో పెళ్లి చేస్తానని బెదిరించిన్నట్లుగా బాధితురాలు చెప్పింది. భర్త సీతారాం, అడపడుచు సైతం వరకట్నం కోసం రోజు ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో అత్తంటి వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లి ప్రసన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని పేరెంట్స్ గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రసుత్తం ప్రసన్న హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఆరోపణలపై స్పందించిన దేవాదాయశాఖ ఇద్దరినీ డ్యూటీ నుంచి సస్పెండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.