భద్రాద్రిలో నిత్య కల్యాణాలు  ప్రారంభం

భద్రాద్రిలో నిత్య కల్యాణాలు  ప్రారంభం
  • వర్షం కారణంగా ప్రాకార మండపంలో నిర్వహణ

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జ్యేష్ఠాభిషేకం సందర్భంగా నిలిపివేసిన నిత్య కల్యాణాలు ఆదివారం తిరిగి ప్రారంభమయ్యాయి. వర్షం కారణంగా బేడా మండపానికి బదులుగా ప్రాకార మండపంలో ఈ కల్యాణం నిర్వహించారు. 95 జంటలు కంకణాలు ధరించి ఈ క్రతువులో పాల్గొన్నాయి. అంతకు ముందు ఉదయం గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేశారు.

మంజీరా(పసుపు ముద్ద)లను భక్తులకు పంపిణీ చేశారు. మూలవరులకు బంగారు పుష్పాలతో అర్చన జరిపారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. ఈవోరమాదేవి ఈనెల 30వ తేదీ వరకు సెలవులో వెళ్లిన నేపథ్యంలో వరంగల్ ​ఎండోమెంట్​ డిప్యూటీ  కమిషనర్ ​శ్రీకాంతరావు పూర్తి అదనపు బాధ్యతలను సోమవారం స్వీకరిస్తున్నారు.