
భద్రాచలం శ్రీరామచంద్రుని కల్యాణం - ... మహా పట్టాభిషేకం ఉత్సవాలను ఆన్ లైన్ టికెట్లు అందుబాటులోకి తీసుకొ చ్చారు. ఇదే సమయంలో ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య కళ్యాణ తలంబ్రాలు పొందే వెసులు బాటు కల్పించారు.
భద్రాచలం.. గొప్పపుణ్యక్షేత్రం.. శ్రీరామనవమి వచ్చిదంటే.. ప్రభుత్వ పెద్దలు అక్కడ క్యూకడతారు. సత్యవాక్ పాలకుడు.. ఏక పత్నీ వ్రతుడు.. శ్రీరామచంద్రుడు కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు .. శ్రీరామనవమి రోజు ( 2025.. ఏప్రిల్ 6) దేశ వ్యాప్తంగా భక్తులు భద్రాచలం చేరుకుంటారు.భద్రాచలం స్వయంగా వెళ్లలేని భక్తులకు స్వామి వారి కల్యాణ తలంబ్రాలు అందించేందుకు తెలంగాణ దేవాదాయ శాఖ - టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు రామయ్య తలంబ్రాలను నేరుగా వారి ఇంటికే చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
చాలా మంది అక్కడ రద్దీని భరించలేక ఇంట్లో టీవీల్లో స్వామి వారి కళ్యాణాన్ని వీక్షిస్తారు. . స్వామి తలంబ్రాలను అందరికి అందించేందుకు ... ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కల్యాణ తలంబ్రాలను నేరుగా భక్తుల ఇంటికి పంపిచేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.
భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవం పూర్తయిన తర్వాత బుకింగ్ చేసుకున్న భక్తులకు తలంబ్రాలు హోం డెలివరీ చేస్తారు. రాములోరి తలంబ్రాలు కావాలని కోరుకునే భక్తులు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాలు లేదా సంస్థ వెబ్‌సైట్ tgsrtclogistics.co.in ఓపెన్ చేసి రూ.151 చెల్లించి మీ పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి. భక్తులు సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించిన అయినా నేరుగా ఆర్డర్ చేయవచ్చు. భక్తులు తలంబ్రాల సేవ పొందాలనుకుంటే టీజీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నెంబర్లు 040-69440000, 040-69440069లను సంప్రదించాలని అధికారులు సూచించారు