![భద్రాచలం సీతారాములకు తిరువీధి సేవ](https://static.v6velugu.com/uploads/2025/02/bhadrachalam-temple-celebrates-ratha-saptami-with-thiruveedhi-service_FsvdYeSuOT.jpg)
భద్రాచలం,వెలుగు : రథసప్తమి వేళ భద్రాచలం సీతారామచంద్రస్వామి మంగళవారం సూర్య,చంద్రప్రభ వాహనాలపై తిరువీధి సేవ జరిగింది. ఉదయం సుప్రభాత సేవ, తిరువారాధన, సేవాకాలం,శాత్తుమురై జరిపారు. ప్రత్యేక హారతులు సమర్పించాక ఉదయం సూర్యప్రభ వాహనంపై సీతారాములు తాతగుడిసెంటర్లోని గోవిందరాజస్వామి ఆలయానికి తిరువీధి సేవగా వెళ్లారు.
సీతారాముల కల్యాణమూర్తులకు బేడా మండపంలో నిత్య కల్యాణం చేశారు. సాయంత్రం దర్బారు , కాగడా హారతిని సమర్పించాక చంద్రప్రభ వాహనంపై స్వామికి తిరువీధి సేవ జరిగింది. వాగ్గేయకారోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు శ్రీపాద యామిని సుబ్బలక్ష్మీ, శాంతిసుధ, విశాలక్షి, చంద్రబాల, మానసవేణు ఆలపించిన కీర్తనలు అలరించాయి.