భద్రాచలం ఆలయ ఈఓ బదిలీ

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓ ఎల్.రమాదేవిని బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డిప్యూటీ కలెక్టర్​హోదాలో ఉన్న ఆమెను మేడ్చల్​జిల్లా కీసర ఆర్డీఓగా బదిలీ చేసింది. రమాదేవి 2023 ఫిబ్రవరి16న భద్రాచలం ఆలయ ఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఏడాది కాలం తనదైన శైలిలో ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కొరడా ఝుళిపించారు. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే ఆలయ నిర్వహణ గాడిలో పడుతోంది.

ఈ టైంలో బదిలీ జరగడంపై ఆమె కొంత అసంతృప్తిగా ఉన్నారు. దగ్గర్లోనే శ్రీరామనవమి వేడుకలు ఉన్నందున, అప్పటివరకు కొనసాగాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల్లో తక్షణమే జీఓ అమలులోకి వస్తుందని ఉండడం గమనార్హం.