
భద్రాచలం,వెలుగు : రామనవమి సీతారాముల కల్యాణ బ్రహ్మోత్సాలల్లో భాగంగా ఏప్రిల్ 6న శ్రీరామనవమి, 7న మహాపట్టాభిషేక మహోత్సవాలకు రావాలంటూ ప్రభుత్వ పెద్దలకు ఆహ్వానపత్రికలు అందజేసి పెళ్లిపిలుపులను శనివారం నుంచి దేవస్థానం ప్రారంభించింది. ఈఓ రమాదేవి, స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్ఆధ్వర్యంలో వైదిక బృందం హైదరాబాద్లో డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆహ్వానపత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రులకు వేదాశీర్వచనం ఇచ్చారు. ప్రసాదం అందజేశారు.