పరశురామావతారంలో భద్రాద్రి రాముడు

పరశురామావతారంలో భద్రాద్రి రాముడు

భద్రాచలం, వెలుగు : ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం సీతారామచంద్రస్వామి పరశురామావతారంలో దర్శనం ఇచ్చారు. దయం సుప్రభాత సేవ అనంతరం గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, బంగారు పుష్పాలతో అర్చన చేశారు. తర్వాత ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లి అక్కడ స్వామి వారిని పరశురాముడిగా అలంకరించారు. స్వామివారిని ఊరేగింపుగా మిథిలా స్టేడియంలోని వేదికపైకి తీసుకెళ్లారు. భక్తుల దర్శనం అనంతరం సాయంత్రం తిరువీధి సేవ నిర్వహించారు.